ఆత్మకూరులో పారిశుధ్యంపై కమిషనర్ దృష్టి
WNP: పట్టణంలోని పలు వార్డుల్లో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శశిధర్ బుధవారం పారిశుధ్య పనులను పరిశీలించారు. డ్రైనేజీల శుభ్రతను తనిఖీ చేసి, డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్త వేర్వేరు నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రజలు చెత్తను వర్గీకరించి మున్సిపల్ వాహనాలకే ఇవ్వాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.