వార్డ్ సభ్యులుగా నామినేషన్ వేసిన మహిళ మృతి
NRML: మామడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పొన్కల్ గ్రామానికి చెందిన దుబ్బాక జమున (45) శనివారం గ్రామంలో 12వ వార్డ్ సభ్యురాలిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసింది. దురదృష్టవశాత్తు ఆదివారం గుండెపోటుతో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయాలు అలుముకున్నాయి.