NGKL: వామ్మో.. ఒకే చోట 37 పాములు
NGKL : నాగర్ కర్నూల్ పట్టణంలోని 15వ వార్డులో వెంకటయ్య అనే వ్యక్తి ఇంటి నీటి గుంతలో ఒకేసారి 37 పాములు బయటపడటం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో స్నేక్ క్యాచర్ వంశీ అక్కడికి చేరుకుని, ఆ నీటి పాములను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం వాటిని సమీపంలోని చెరువులో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.