VIDEO: జగనన్న కాలనీలో ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

CTR: పుంగనూరు గూడూరుపల్లి సమీపాన జగనన్న కాలనీలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కనే చేతికందే ఎత్తులో ఇది ఉంది. దాని ఎత్తు పెంచకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలను తొలగించి కంచెను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.