రాజమౌళికి థ్యాంక్స్ చెప్పిన స్టార్ డైరెక్టర్

రాజమౌళికి థ్యాంక్స్ చెప్పిన స్టార్ డైరెక్టర్

దర్శకధీరుడు రాజమౌళిపై స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రశంసలు కురిపించాడు. రాజమౌళి గనుక 'బాహుబలి' తీయకపోతే, తాను 'పొన్నియిన్ సెల్వన్' తీసేవాడిని కాదని స్పష్టం చేశాడు. భారతీయ సినిమాలను భారీ బడ్జెట్‌తో నిర్మించవచ్చని, అవి కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాయని రాజమౌళి నిరూపించాడని కొనియాడాడు. ఆ స్ఫూర్తి అందించినందుకు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు.