విద్యుత్ తీగలతో.. పొంచి ఉన్న ప్రమాదం

విద్యుత్ తీగలతో.. పొంచి ఉన్న ప్రమాదం

WGL: రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో ప్రధాన విద్యుత్ లైన్లు చేతికందే ఎత్తులో ఉండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈదురుగాలులు, వర్షాలు వచ్చే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అని గ్రామస్తులు, అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్య పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇవాళ కోరారు.