కొత్తవలసలో చోరీ

VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి చింతలపాలెం డెక్కన్ ఫెర్రో అల్లోయ్ కంపెనీ సమీపంలో ఉన్న శీరంశెట్టివానిపాలెం ఓ ఇంటిలో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఇంటిలోకి ప్రవేశించి బంధువులను బెదిరించి బలవంతంగా రెండున్నర తులాల బంగారం,రూ. 20 వేలు నగదును అపహరించుకుపోయారు. సంఘటన స్థలాన్ని ఎస్.కోట గ్రామీణ సీఐ అప్పలనాయుడు, స్థానిక ఎస్సై జోగారావు పరిశీలించారు.