నేడు అన్నదాత సుఖీభవ నిధుల జమ
W.G: నూజివీడు మండలంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలలో 9,240 మంది రైతులు 6.09 కోట్ల రూపాయలు పొందనున్నట్లు మండల వ్యవసాయ అధికారి చెన్నారావు తెలిపారు. నూజివీడులో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకంలో రూ. 4.62 కోట్లు, కేంద్రం అందించే పీఎం కిసాన్ పథకంలో రూ.1.47 కోట్లు, మొత్తం 6.09 కోట్లను జమ చేస్తారన్నారు.