రైతు వేదికలో 'రైతు నేస్తం'.. సాగుపై అవగాహన!
KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇవాళ 'రైతు నేస్తం' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడీఏ సతీష్, ఏవో రాధా పాల్గొని పుచ్చకాయ సాగులో మెళకువలు, అధిక దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు వివరించారు. సాగులో ఎదురయ్యే సందేహాలను అధికారులను అడిగి రైతులు నివృత్తి చేసుకున్నారు.