అన్ని వసతులున్న భవనంలోకి మార్చాలని ఆదేశం

అన్ని వసతులున్న భవనంలోకి మార్చాలని ఆదేశం

NLG: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం రాత్రి ఆమె కట్టంగూరు మండలం, అయిటిపాములలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, పరిసరాలు, డైనింగ్, వంటలను పరిశీలించారు. అలాగే నకిరేకల్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అన్ని వసతులు గల భవనంలోకి మార్చాలని ఆదేశించారు.