శతాధిక వృద్ధురాలికి ఘన సన్మానం
MHBD: చిన్నగూడూర్ మండలం విస్సంపల్లి గ్రామంలో శతాధిక వృద్ధురాలు రంగనాయకమ్మ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆమెను సన్మానించారు. వందేళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత, మాజీ జడ్పీటీసీ మంజుల తదితరులు పాల్గొని రంగనాయకమ్మ ఆశీస్సులు తీసుకున్నారు.