నాటు కోళ్ల దొంగలు అరెస్టు
E.G: గోకవరం మండలం తంటికొండకి చెందిన కోవ్వాడ బాబురావు ఫిర్యాదు మేరకు నాటు కోళ్ల దొంగతనం కేసులో ఎస్ఐ పవన్ కుమార్ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆవులు గోపి, కొత్తపల్లి రమేశ్, పిల్లా నరేంద్ర, మేడికొండ అనిల్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30 వేలు విలువైన కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.