ధర్మవరంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ సహకారంతో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాట్లను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హరీష్ బాబు పరిశీలించారు. ఏప్రిల్ 8 నుంచి 14 వరకు ధర్మవరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ శిబిరం జరుగుతుందన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని తెలిపారు.