గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి: చల్లా ధర్మారెడ్డి

గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి: చల్లా ధర్మారెడ్డి

HNK: కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. నడికుడ మండలం పులిగిల్ల, వరికోల్, నర్సక్కపల్లి గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు మంగళవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నికల తర్వాత అందరూ కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.