డ్యాన్స్ స్టెప్పులతో రచ్చ చేసిన మాజీ ఎమ్మెల్యే
ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి డ్యాన్స్‌తో సందడి చేశారు. తన అన్న తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి కూతురి వివాహ వేడుకలో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో స్టెప్పులతో రచ్చ చేశారు. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసి సందడి చేశారు. తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా స్టెప్పులేశారు.