ఎన్డీఏ కూటమి అభ్యర్థుల రోడ్ షో

ఎన్డీఏ కూటమి అభ్యర్థుల రోడ్ షో

తూ.గో: అనపర్తి నియోజకవర్గంలోని రంగంపేట, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో మంగళవారం ఎన్డీఏ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుబాటి పురందేశ్వరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు రోడ్ షో నిర్వహించారు. రంగంపేట మండలం నల్లమిల్లి నుంచి బిక్కవోలు మండలం మీదుగా పెదపూడి మండలం శివారు రామేశ్వరం వరకు రోడ్ షో జరిగింది. అడుగడుగునా ప్రజలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు.