చినరావూరులో తీవ్ర విషాదం
GNTR: దేవరపల్లి దిండి కాలువలో గురువారం ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెనాలి చినరావూరుకు చెందిన కేతావత్ రాము నాయక్ (34) కూడా ఉండటంతో స్థానికంగా విషాదం నెలకొంది. దసరా పండుగకు బంధువులతో కలిసి అక్కడకు వెళ్లిన రాము కాలువలో పడిన మేనల్లుడు సాయి ఉమాకాంత్‌ను రక్షించే క్రమంలో మృతి చెందాడు. నేడు సాయంత్రానికి మృతదేహం తెనాలికి రానుంది.