కదిరిలో 44 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
సత్యసాయి: కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి వసతి గృహంలో నియోజకవర్గానికి చెందిన 44మందికి ముఖ్యమంత్రి సహాయ నిధిగా రూ. 31,05,742 చెక్కులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. ప్రజల సమస్యలను గుర్తించి సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.