మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్న మల్లయ్య వర్ధంతి
KNR: చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ దేశిని చిన్నమల్లయ్య 8వ వర్ధంతిని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నమల్లయ్య సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజవ్వ, లక్ష్మణ్, కుమార్, ఎల్లవ్వ, పాల్గొన్నారు.