ఇంటిలో దొంగతనం.. రూ. 5 లక్షలు మాయం

ఇంటిలో దొంగతనం.. రూ. 5 లక్షలు మాయం

GNTR: పొన్నూరు మండలం చింతలపూడిలోని ఓ ఇంటిలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. బంగారు బాబుకు చెందిన ఇంట్లో దొంగలు చొరబడి తాళాలు పగులగొట్టి, బీరువాలోని వెండి వస్తువులు, రూ. 5 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుడు అమెరికాలో ఉండటంతో, బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.