VIDEO: గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారుల ఆందోళన
SRD: గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన వారికి ఇవ్వకుండా మధ్యవర్తులు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఖేడ్‌లోని భారత్ గ్యాస్ ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. బయట హోటల్ వాళ్లకు అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. బుకింగ్ చేసి వారమైందని డెలివరీ OTP వచ్చిందని తడ్కల్‌కు చెందిన రాజ్ కుమార్ తెలిపారు.