శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి ఆలయంలో పవిత్ర సమర్పణ

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి ఆలయంలో పవిత్ర సమర్పణ

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. అనంతరం అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.