'ఆరోగ్య సిబ్బంది రికార్డుల నిర్వహణపై శ్రద్ధ వహించాలి'
SRPT: ఆరోగ్య సిబ్బంది రికార్డుల నిర్వహణపై శ్రద్ధ వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం పెన్ పహాడ్ మండలంలోని సింగారెడ్డి పాలెం, అనంతారం గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. రికార్డులు సక్రమంగా నిర్వర్తించకపోతే కఠిన చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు.