VIDEO: 'నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు'
MDK: రామాయంపేట మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రాకపోవడంపై సీఐ వెంకటరాజ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్మెట్ లేకుండా, ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. రాష్ డ్రైవింగ్ మానుకొని, హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని ఆయన కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.