RUBలో భారీగా నిలిచిన వర్షపు నీరు

GNTR: నగరంలో కురిసిన భారీ వర్షానికి కంకరగుంట RUB నీటితో నిండింది. రాకపోకలు సాగించడానికి వీలులేకపోవడంతో జీఎంసీ అధికారులు మోటర్లు పెట్టి నీటిని తోడుతున్నారు. అధికారుల దూరదృష్టి లోపమే వర్షం పడిన ప్రతీసారి తమకు శాపంలా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు.