ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

NGKL: జిల్లా తిమ్మాజిపేట మండలం బావాజీపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బత్తుల బాలస్వామి(55) తన పొలంలో ట్రాక్టర్‌తో సొంత పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే చనిపోయాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.