'నీటి సంరక్షణకు 100 రోజుల చర్యలు'
KRNL: జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం 100 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్ డా.సిరి గురువారం ప్రారంభించారు. కోసిగి మండలం డి.బెలగల్‌లో చెక్‌డ్యామ్, నాగమ్మ చెరువును పరిశీలించి వాగులు, వంకల అడ్డంకులు తొలగించాలని ఆదేశించారు. భూగర్భ జలమట్టాన్ని 6.6 మీటర్ల నుంచి 4 మీటర్ల లోపు తగ్గించడమే లక్ష్యమని, 246 చెరువులు పునరుద్ధరిస్తామని కలెక్టర్ తెలిపారు.