GP కార్యదర్శి బదిలీ.. అనుచిత ఫ్లెక్సీలపై చర్య

MLG:వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి చందులాల్‌ను బదిలీ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆయన నిధులు లేవని, తోపుడు బండి కోసం రూ.8 వేలు విరాళం ఇవ్వాలని ‘నేను తోపుడు బండిని-నా ఖరీదు రూ.8,000’ అని ఫ్లెక్సీలు ముద్రించి పంచాయతీ ముందు ఏర్పాటు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు చందులాల్‌పై బదిలీ వేటు వేశారు.