నేడు కలెక్టరేట్లో PGRS కార్యక్రమం
KKD: కాకినాడ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ షన్మోహన్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. స్వయంగా రాలేని వారు ఆన్లైన్లో అర్జీలు సమర్పించవచ్చని, తమ సమస్య ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్ చేయవచ్చనన్నారు.