ప్రమాదకరంగా బీఆర్ఎస్ ప్లెక్సీ

SRD: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ప్లెక్సీ ప్రమాదకరంగా మారింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకుని పార్టీ నాయకులు ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్ బోర్డుకు భారీ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం గాలి దుమారానికి ప్లెక్సీ సిగ్నల్ బోర్డును కొద్ది దూరం వరకు లాక్కెళ్లి రోడ్డు మీదపడింది.