కోదండ రాముని దర్శించుకున్న ఎమ్మెల్యే
KDP: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం కమలాపురం MLA చైతన్య రెడ్డి, మంత్రి సవితతో పాటు ఆయన కోదండ రాముని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారిని శేష వస్త్రంతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు MLA చైతన్య రెడ్డి తెలిపారు.