నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
BDK: పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్ క్యాంపులను మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. నవంబరులో నిర్వహించిన క్యాంపులు కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు, 22 నుంచి 24వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. బయోమెట్రిక్ అప్ డేట్ మిగిలి ఉన్న విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు.