కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
MHBD: కేసముద్రం మండలం మహామూద్‌పట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించాల్సిన మెనూను పాటించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.