వైసీపీ నేతలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం
కృష్ణా: చల్లపల్లి లోని మెయిన్స్ సెంటర్‌లో వైసీపీ నేతలు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటు ఇతరులకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాలను సమర్పించి, ప్రజాభిప్రాయాన్ని తెలియజేస్తారన్నారు.