జిల్లాలో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల , పలుచోట్ల అకాల వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో అత్యధికంగా బిచ్కుంద మండలంలోని, పుల్కల్‌లో 42.3, బీర్కూరులో 42.1, బాన్సువాడలో 42, అత్యల్పంగా సదాశివ్ నగర్ మండల కేంద్రంలో 37.9 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదయింది.