ఆడపిల్ల పుడితే రూ.10,000.. ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు
SRCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చిత్రవిచిత్ర హామీలతో ఆకట్టుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా ఆరేపల్లిలో ఓ అభ్యర్థి గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఆమె పేరిట రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా కాప్రాయిపల్లిలో ఓ అభ్యర్థి ఆడపిల్ల పుడితే రూ.2వేలు, తీజ్ పండుగకు రూ.20వేలు, అంత్యక్రియలకు రూ.5వేలు వంటి హామీలను ప్రటించారు.