సంజామల మండల ప్రజలకు శుభవార్త
నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇకపై సంజామల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోనే ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) నిర్వహిస్తున్నట్లు శుక్రవారం తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. ప్రజలు వ్యయ ప్రయాసాలతో నంద్యాల కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా, మండల కేంద్రంలోనే పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.