హెల్మెట్ వినియోగంపై అవగాహన
ELR: హెల్మెట్ వినియోగంపై ప్రజలకు ముసునూరు పోలీసులు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై చిరంజీవి ద్విచక్ర వాహనదారులకు వినూత్న రీతిలో జరిమాణాలు విధించకుండా హెల్మెట్లు కొనుగోలు చేసి ధరింప చేశారు. అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలని సూచించారు.