గొంతు గరగరతో బాధపడుతున్నారా?
గొంతు సమస్యలతో బాధపడేవారు తేనె తాగడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. దీనిలోని ఫ్లేవనాయిడ్లు గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయన్నారు. తేనె చిక్కగా ఉండటం వల్ల గొంతు లోపలి పొర మీద పూతలా ఉండి రక్షణగా నిలుస్తుందని తెలిపారు. దీంతో చిరాకు, గరగర తగ్గుతాయట. గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.