VIDEO: క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం ప్రారంభం
ASR: గిరిజన యువకులు క్రీడల్లో ప్రతిభ చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఏపీ స్పోర్ట్స్ డైరెక్టర్ జగదేశ్వరి అన్నారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటి ఆధ్వర్యంలో రంపచోడవరం గురుకుల పాఠశాలలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం సోమవారం ప్రారంభం అయ్యింది. 14ఏళ్ళ లోపు బాల బాలికలను ఎంపిక చేసి కడప స్పోర్ట్స్ స్కూల్‌లో చదువుతో పాటు ఆటల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.