VIDEO: 'విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి'

VIDEO: 'విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి'

ప్రకాశం: వినాయక చవితి సందర్భంగా రాచర్లలో విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రజలు పోలీసుల వద్ద తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్సై కోటేశ్వరరావు బుధవారం అన్నారు. కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారో ఎన్ని రోజులు విగ్రహం ఏర్పాటు చేస్తారో లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాలని సూచించారు. అల్లర్లు, గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.