ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి
BPT: నగరం మండలంలోని బొడ్డువారిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేశ్వర రావు అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా శివంగలపాలెం వద్ద వెగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దినేష్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి, కుమార్తె కాళ్లు విరగడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.