VIDEO: 'డీ వార్మింగ్ మాత్రలు తప్పనిసరి'
పిల్లలందరికీ డీవార్మింగ్ మాత్రలు తప్పనిసరిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.అనిత అన్నారు. శనివారం శ్రీకాకుళం డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నులిపురుగులు రహిత సమాజం తయారు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఫిబ్రవరి 17న డీవార్మింగ్ డే నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,27,000 వేల మంది విద్యార్థులకు మాత్రలు వేయిస్తామన్నారు.