అయ్యప్ప పూజలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
NLG: సోమవారం రాత్రి అయ్యప్ప స్వాములు అంగడిపేటలో నిర్వహించిన మహాపడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, కుందూరు జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం మహాపడిపూజ నిర్వాహకులు ఎమ్మెల్యేలను శాలువాలు కప్పి సన్మానించారు.