అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి

MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్ వాడ ఏ క్యాబిన్ ప్రాంతంలో ఒక ఇంట్లో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతులు బెజ్జం సత్యవతి, ఆమె మనవరాలు గీతా శిరీషగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.