'మంత్రి ఉత్తమ్ సహకారంతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా'
SRPT: మఠంపల్లి మండలంలోని కృష్ణ తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బానోతు రమాదేవి శంకర్ నాయక్‌ను, గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.