ఆలయంలో ధర్మకర్త నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో ఖాళీగా ఉన్న మహిళ ధర్మకర్త నియామకానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. సురేష్ బాబు ఓ ప్రకటన లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 20 రోజుల్లోగా దరఖాస్తు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు దేవస్థానం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.