వైరాను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం: Dy.CM
KMM: వైరా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. గతంలో నిర్మించిన వైఎస్సార్ భవనం నుంచి చెరువు గట్టు వరకు ఉన్న ప్రాంతాన్ని ఆధునీకరించి, అక్కడ అత్యాధునిక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీంతో పాటు కుటుంబాల కోసం ఫుడ్ కోర్ట్స్, పిల్లల కోసం చిల్డ్రన్ పార్క్ నిర్మిస్తామన్నారు.