VIDEO: భారీ వర్షం.. స్థానికుల ఇబ్బందులు

HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధిలో, చర్చి గాగిల్లాపూర్ సర్వే నంబర్ 214లో మంగళవారం భారీ వర్షం కారణంగా బస్తీలో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. దీనితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుండిగల్ మున్సిపల్ అధికారులు తమ వైపు కన్నెత్తి చూడటం లేదని, ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.