పలు కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని

HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలు స్లమ్ ఏరియాలో నేడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పర్యటించారు. 49వ డివిజన్ రెవెన్యూ కాలనీ, లోటస్ కాలనీ, ప్రకాష్ రెడ్డి పేట, ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.